Jump to content

1824

వికీపీడియా నుండి

1824 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1821 1822 1823 - 1824 - 1825 1826 1827
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 8: మైకెల్ ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు.
  • మార్చి 17: ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారమే భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమైపోయాయి.
  • మార్చి 29: కైరోలో జరిగిన అగ్నిప్రమాదంలో 4,000 మంది చనిపోయారు.[1]
  • మే 24: మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం మొదలైంది
  • అక్టోబరు 21: జోసెఫ్ ఆస్పిడిన్ పోర్ట్‌ల్యాండ్ సిమెంటుకు పేటెంటు పొందాడు
  • నవంబరు 2: బారక్‌పూర్‌లో బ్రిటిషు వారిపై సిపాయీలు తిరుగుబాటు చేసారు.
  • నవంబరు 19: రష్యా, సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో వచ్చిన వరదల్లో నీరు మామూలు మట్టం కంటే 421 సెం.మీ.ఎత్తుకు చేరింది
  • తేదీ తెలియదు: అవనిగడ్డ లోని 1000 సంవత్సరాల నాటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు
  • తేదీ తెలియదు: లక్ష రూపాయల ఖర్చుతో చార్మినారు ఉపరితలాన్ని ప్లాస్టరింగు చేసారు .[2]
  • తేదీ తెలియదు: న్యూ హాలండ్ పేరుతో ఉన్న దేశానికి ఆస్ట్రేలియా అని అధికారికంగా నామకరణం చేసారు.ఈ పేరును మాథ్యూ ఫ్లిండర్స్ 1804 లో సూచించాడు.

జననాలు

[మార్చు]
దయానంద సరస్వతి చిత్రం

మరణాలు

[మార్చు]
  • ఏప్రిల్ 19: లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి. (జ.1788)
  • డిసెంబరు 21: జేమ్స్ పార్కిన్సన్, బ్రిటిషు సర్జన్. ఇతడి పేరు మీదనే పార్కిన్సన్ జబ్బు పేరు వచ్చింది. (జ. 1755)
  • తేదీ తెలియదు: అమృత రావు మరాఠా నేత, పేష్వా రఘునాథ రావు దత్తపుత్రుడు. (జ. 1770)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp71
  2. ↑ Ifthekhar, J.S. (31 August 2010). "Charminar minaret suffers damage due to rain". The Hindu. N. Ram. Archived from the original on 8 జనవరి 2016. Retrieved 5 December 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=1824&oldid=4975732" నుండి వెలికితీశారు