సి.కృష్ణవేణి
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.
| మేకా కృష్ణవేణి | |
|---|---|
గొల్లభామ సినిమాలో కృష్ణవేణి | |
| జననం | యర్రంశెట్టి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 పంగిడి గూడెం, కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం |
| నివాస ప్రాంతం | మద్రాసు (చెన్నై), హైదరాబాదు |
| ఇతర పేర్లు | చిత్తజల్లు కృష్ణవేణి - మీర్జాపురం రాణి |
| వృత్తి | తెలుగు చలనచిత్ర నటి, గాయని, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1936 నుంచి 1957 వరకు |
| మతం | హిందూ మతం |
| భార్య / భర్త | మీర్జాపురం రాజా ' మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్ |
| పిల్లలు | మేకా రాజ్యలక్ష్మి అనూరాధ |
| తండ్రి | డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు[1] |
| తల్లి | నాగరాజు |
సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
జీవిత చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.


కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)తో వివాహం జరిగింది. ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
మీర్జాపురంరాణి - కృష్ణవేణి, నటి , నిర్మాత , గాయని , స్టూడియో అథినేత కృష్ణవేణి జీవిత చరిత్ర . [2]
ఈ పుస్తకాన్ని భగీరథ రచించారు . దీనిని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు విడుదల చేశారు . [3]
పురస్కారాలు
[మార్చు]- తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
- 2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్ టైమ్ ఎఛివ్మెంట్ అవార్డును ఆమె అందుకుంది.[4]
- 2022: ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం[5]
- 2025లో ఎన్ .టి .రామారావు నటించిన 'మనదేశం ' సినిమా వజ్రోత్సవం సందర్భంగా కృష్ణవేణిని సత్కరించిన అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు.
కృష్ణవేణి నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 1935 | సతీ అనసూయ | ||
| 1937 | మోహినీ రుక్మాంగద | ||
| 1938 | కచ దేవయాని | ||
| 1939 | మళ్ళీ పెళ్ళి | అన్నపూర్ణ | |
| మహానంద | |||
| 1940 | జీవనజ్యోతి | ||
| 1941 | దక్షయజ్ఞం | ||
| 1942 | భక్త ప్రహ్లాద | ||
| 1944 | భీష్మ | ||
| 1947 | బ్రహ్మరథం | ||
| గొల్లభామ | స్వయంప్రభ | ||
| 1948 | మదాలస | ||
| కామవల్లి | తమిళ సినిమా | ||
| 1949 | మన దేశం | నిర్మాత కూడా | |
| ధర్మాంగద | |||
| 1950 | లక్ష్మమ్మ | ||
| ఆహుతి | |||
| తిరుగుబాటు | |||
| 1951 | పేరంటాలు |
నిర్మాతగా కృష్ణవేణి
[మార్చు]కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
[మార్చు]- భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
- సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
[మార్చు]- మన దేశం (1949)
- లక్ష్మమ్మ (1950)
- దాంపత్యం (1957)
- గొల్లభామ (1947)
- భక్త ప్రహ్లాద (1942)
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైంది
మరణం
[మార్చు]సి. కృష్ణవేణి (మేకా కృష్ణవేణి)16 ఫిబ్రవరి,2025న ఫిల్మ్నగర్లోని తన స్వగృహంలో వయోభారంతో బాధ పడుతూ కన్నుమూసారు[6][7][8][9]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ch Krishnaveni's Exclusive Interview - Telugucinema.com Oct 25, 2005[permanent dead link]
- ↑ Bhageeradha. G, Bhageeradha. G (2025). Meejapuramrani Krishnaveni. Hyderabad: Shaili & Shaili Creative Communications. pp. pages 516. ISBN 978-93-5525-119-0.
{{cite book}}:|pages=has extra text (help) - ↑ Meerjapuramrani- Krishnaveni
- ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Nava Telangana (2 December 2022). "నటి కృష్ణ వేణికి ఆకృతి-ఘంటసాల శతాబ్ది పురస్కారం". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ "Krishnaveni: అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు". EENADU. Retrieved 2025-02-16.
- ↑ "తెలుగు సినిమా తొలి మహిళా నిర్మాత కృష్ణవేణి ఇకలేరు". NT News. 17 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత". Sakshi. 17 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "కృష్ణవేణి మరణం సినీరంగానికి తీరని లోటు : తెలంగాణ ఎఫ్డీసీ మాజీ చైర్మన్". NT News. 16 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
వెలుపలి లంకెలు
[మార్చు]- Articles with dead external links from నవంబర్ 2022
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- 1924 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా గాయకులు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- తెలుగు సినిమా బాలనటులు
- కృష్ణా జిల్లా గాయకులు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు
- తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటీమణులు
- తూర్పు గోదావరి జిల్లా మహిళా గాయకులు
- తూర్పు గోదావరి జిల్లా మహిళా సినిమా నిర్మాతలు
- భారతీయ మహిళా గాయకులు
- తెలుగు సినిమా మహిళా నేపథ్య గాయకులు
- 2025 మరణాలు