Jump to content

దువ్వూరి సుబ్బారావు

వికీపీడియా నుండి
దువ్వూరి సుబ్బారావు
దువ్వూరి సుబ్బారావు
జననందువ్వూరి సుబ్బారావు
ఆగష్టు 11, 1949
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
వృత్తిభారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌
ప్రసిద్ధిభారతీయ రిజర్వ్ బాంక్
పదవి పేరురిజర్వ్ బ్యాంకు గవర్నర్
ముందు వారువై.వేణుగోపాలరెడ్డి
భార్య / భర్తఊర్మిళ
పిల్లలుమల్లిక్, రాఘవ
తండ్రిమల్లికార్జునరావు
తల్లిసీతారామం

భారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌గా సెప్టెంబరు 5, 2005 నుండి సెప్టెంబరు 4, 2013 వరకు పనిచేసిన దువ్వూరి సుబ్బారావు 1949 ఆగష్టు 11 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన చెందిన తెలుగు వ్యక్తి. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావు తల్లి సీతారామానికి మూడవ సంతానంగా జన్మించాడు. ఆయన 1962 నుండి 1965 వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య చదివిన ఆయన 1969లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లో భౌతిక శాస్త్రంలో బిఎస్సీ (ఆనర్స్) ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. మెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి [1][2] ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.

కెరీర్

[మార్చు]

సుబ్బారావు ఆర్థిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. స్టీఫెన్ హాకింగ్ రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.

సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో, ఆర్థిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు.[3] ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు. ప్రపంచ బ్యాంకులో 1999 నుండి 2004 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. అటు పైన 2005 నుండి 2007 వరకూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా సంఘంలో ముఖ్య పదవి పోషించాడు. 2007లో భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 2008 సెప్టెంబరు 5న, భారత ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పదివి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) కు 22వ గవర్నర్‌గా నియమితుడు అయ్యాడు.[4] అతని స్థానంలో, 2008 సెప్టెంబరు 21న అరుణ్ రామనాథన్ ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2011లో సుబ్బారావు పదవీ బాధ్యతలు మరో రెండేళ్ళు పొడిగింపబడ్డాయి.

సాధించిన విజయాలు

[మార్చు]

ఆర్.బి.ఐ గవర్నర్‌గా పనిచేసే సమయంలో ఆర్.బి.ఐ నుండి వెలువడే పత్రికలలో ఎన్నో ఆర్థిక విధానాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాటిని విపులంగా, సులభతరంగా మార్చి ప్రచురింపజేశాడు సుబ్బారావు. సెంట్రల్ బ్యాంకు పాలసీలను, క్లిష్టతరమైన ఆర్థికపరమైన విధానలను సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా ఉండేవి ఆ ప్రచురణలు. మారుమూల పల్లెలలోని వారికి కూడా ఆర్థిక అక్షరాస్యత అందే విధంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించాడు సుబ్బారావు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 100 శాతం ఆర్థిక విధానాల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత సుబ్బారావుకే దక్కింది.[5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1988-93 : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
  • 1993-98 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
  • 1998-04: ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
  • 2004-08 : కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
  • 2008 - 2013 : రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా
  • 2014 - సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో విశిష్ట అధ్యాపకుడు (Distinguished Visiting Fellow )

అవీ ఇవీ

[మార్చు]
దువ్వూరి_సుబ్బారావు_గారి_తల్లి_తండ్రి
  • అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో ఇతడు సభ్యుడు.[6]
  • ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి [7]
  • ఇది వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన వై.వేణుగోపాలరెడ్డి కూడా తెలుగు వ్యక్తే.

రచనలు

[మార్చు]
  • Who Moved My Interest Rate?[8] - రిజర్వు బ్యాంకు రాతిగోదల వెనకాల (తెలుగు లో)
  • 2024 లో Just A Mercenary?: Notes from My Life and Career (జస్ట్ ఎ మెర్సెనరీః నా జీవితం, వృత్తి నుండి నోట్స్) పేరిట ఆత్మకథ రాసుకున్నారు.[9]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Finance Secretary D Subbarao appointed RBI Governor". The Economic Times. 2008-09-02. ISSN 0013-0389. Retrieved 2026-10-12.
  2. ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008
  3. ↑ "PROFILE - RBI governor Duvvuri Subbarao". Reuters. Businessweek. 7 November 2012. Archived from the original on 2 సెప్టెంబరు 2015. Retrieved 8 February 2013.
  4. ↑ "Finance Secretary D Subbarao appointed RBI Governor". The Economic Times. 2008-09-02. ISSN 0013-0389. Retrieved 2025-12-14.
  5. ↑ "Subbarao declares Ernakulam as India's First Financially Included District". The Times of India. Retrieved 2021-06-30.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  6. ↑ ఈనాడు దినపత్రిక, తేది 02-09-2008
  7. ↑ సాక్షి దినపత్రిక, పేజీ 2, తేది 02.09.2008
  8. ↑ "I paid the price for asserting RBI's autonomy: Subbarao". www.business-standard.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-14.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. ↑ "'Pranab Mukherjee, Chidambaram used to pressurise RBI to present rosier picture of growth,' claims ex Governor Subbarao - BusinessToday". Business Today (in ఇంగ్లీష్). 2024-04-15. Retrieved 2025-12-14.