Jump to content

జీవవైవిధ్యం

వికీపీడియా నుండి
ఉత్తర సాస్కచెవాన్ లో ఉన్న అరణ్యంలో శిలీంధ్రాలు జీవవైవిధ్యానికి ఒక ఉదాహరణ

జీవవైవిధ్యం అంటే భూమి మీద ఉన్న వివిధ రకాలైన జీవకోటిలో ఉన్న వైవిధ్యం. దీన్ని వివిధ స్థాయిల్లో కొలవవచ్చు.[1] ఈ వైవిధ్యం భూమి అంతటా సమానంగా విస్తరించలేదు. భూమధ్యరేఖకు సమీపంలోఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో వెచ్చటి వాతావరణం వలన జీవక్రియకు అనుకూలంగా ఉండి జీవవైవిధ్యం హెచ్చుగా ఉంటుంది. ఉష్ణమండల అరణ్యాలు భూమిపైన ఉన్న మట్టిభాగంలో కేవలం ఐదో భాగమే అయినా ప్రపంచపు జీవజాలంలో 50% ఇక్కడ కనిపిస్తాయి.[2]

మానవ కార్యకలాపాలు కూడా ప్రస్తుతం క్షీణిస్తున్న జీవవైవిధ్యానికి కారణం. వ్యవసాయం కోసం జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడం ఒక కారణం. వాతావరణంలో మార్పులు కూడా మరొక కారణం.

2011 లో మోరా, ఇంకా ఇతర పరిశోధకులు చేసిన పరిశోధనల ప్రకారం సుమారు 87 లక్షల భూచర జీవజాతులు, 22 లక్షన జలచర జీవజాతులు ఉన్నాయి. వీటిలో కేంద్రకయుత జీవుల అంచనా చాలా వరకు కచ్చితంగా ఉండగా, కేంద్రకపూర్వ జీవుల అంచనా కొంత తక్కువ కచ్చితత్వంతో ఉంటుంది.[3] కొన్ని జంతువులు కనుమరుగు అయ్యే రేటు ఎక్కువ కావడం వలన, వాటిని వర్ణించేలోపే అవి ఆంతరించే ప్రమాదం ఉంది.[4] జంతుప్రపంచంలో పక్షులు, క్షీరదాల మీద ఎక్కువగా పరిశోధనలు జరగగా, చేపలు, ఇతర అకశేరుకాల మీద తక్కువ పరిశోధనలు జరిగాయి.[5]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి (APSBB) పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి ప్రతి సంవత్సరం పురస్కారాలను అందజేస్తుంది. ఈ పురస్కారాలు పక్షుల పరిశీలన, తడినేలల (Wetlands) పరిరక్షణ, అరుదైన మొక్కల సంరక్షణ, జీవవైవిధ్య అవగాహన కల్పించడంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు. [6]

కె. మృత్యుంజయ రావు (K. Mrutyumjaya Rao): కాకినాడకు చెందిన వీరు, ఆంధ్రప్రదేశ్ లో, దేశ వ్యాప్తంగా  పక్షుల పరిశీలన (Ornithologist) సంరక్షణ, పరిరక్షణలో విశేష కృషి చేసి ఎందరికో మార్గదర్శకులయ్యారు. పర్యావరణ అవగాహనా సదస్సులు, ఆవశ్యకత గురించి విశేష కృషి.

డా. తుళ్ళి రవిశంకర్ (Thupalli Ravi Shankar): తడినేలల (Wetland) నిపుణుడిగా, గోదావరి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు.

డా. రామ్మూర్తి: విశాఖపట్నంలోని  ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, పర్యావరణ శాస్త్రం, మొక్కల వైవిధ్యంపై పరిశోధనలు చేసి అవగాహన కల్పించారు.

పి. దాలినాయుడు: వన్యప్రాణుల సంరక్షణలో, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి నుండి జీవ వైవిధ్య సంరక్షక పురస్కారాలు అందుకున్న నలుగురు. డా.రవిశంకర్, కె. మృత్యుంజయరావు , డా.రామ్మూర్తి, పి.దాలినాయుడు. [7]

మూలాలు

[మార్చు]
  1. ↑ Faith, Daniel P. (1992). "Conservation evaluation and phylogenetic diversity". Biological Conservation. 61 (1): 1–10. Bibcode:1992BCons..61....1F. doi:10.1016/0006-3207(92)91201-3.
  2. ↑ Pillay, Rajeev; Venter, Michelle; Aragon-Osejo, Jose; González-del-Pliego, Pamela; Hansen, Andrew J; Watson, James EM; Venter, Oscar (February 2022). "Tropical forests are home to over half of the world's vertebrate species". Frontiers in Ecology and the Environment. 20 (1): 10–15. Bibcode:2022FrEE...20...10P. doi:10.1002/fee.2420. PMC 9293027. PMID 35873358.
  3. ↑ Mora, Camilo; Tittensor, Derek P.; Adl, Sina; Simpson, Alastair G. B.; Worm, Boris; Mace, Georgina M. (23 August 2011). "How Many Species Are There on Earth and in the Ocean?". PLOS Biology. 9 (8): e1001127. doi:10.1371/journal.pbio.1001127. PMC 3160336. PMID 21886479.{{cite journal}}: CS1 maint: article number as page number (link)
  4. ↑ McKie, Robin (25 September 2005). "Discovery of new species and extermination at high rate". The Guardian. London.
  5. ↑ Bautista, Luis M.; Pantoja, Juan Carlos (2005). "What species should we study next?". Bulletin of the British Ecological Society. 36 (4): 27–28. hdl:10261/43928.
  6. ↑ Andhra Pradesh State Biodiversity Board (2021-10-11), APSBB’s Biodiversity Conserver Awardees 2021I Video Presentation 1, retrieved 2026-04-12.
  7. ↑ Andhra Pradesh State Biodiversity Board (2021-10-11), APSBB’s Biodiversity Conserver Awardees 2021I Video Presentation 1, retrieved 2026-04-12