Jump to content

అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏ. ఎల్. ఎస్.)

వికీపీడియా నుండి
అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏ. ఎల్. ఎస్.)
ఇతర పేర్లుమోటార్ న్యూరాన్ వ్యాధి అని (MND); లౌ గెహ్రిగ్ వ్యాధి
ALS నిర్ధారణకోసం అంతర్గత క్యాప్సూల్ (internal capsule) పృష్ఠ భాగంలో పెరిగిన సిగ్నల్‌ను చూపే MRI స్కాన్ — ఈ సిగ్నల్ మోటార్ కార్టెక్స్ వరకు విస్తరించి ఉన్నట్లు గుర్తించవచ్చు.
ప్రత్యేకతనాడీ సంబంధ వ్యాధులు
లక్షణాలుకండరాల బిగుసుదనం, కండరాల అదిరిపాటు, క్రమంగా తీవ్రమయ్యే బలహీనత
సంక్లిష్టతలుమాట్లాడటంలో, మింగడంలో, శ్వాసించడంలో ఇబ్బంది
సాధారణ ప్రారంభం50 సంవత్సరాలు – 60 సంవత్సరాలు
కారణాలుతెలియదు. జన్యు పర్యావరణ కారణాలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు అనుసరించి
చికిత్సనాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్
ఔషధంరిలుజోల్, ఎడరావోన్
రోగ నిరూపణవ్యాధి ప్రారంభం నుంచి ఆయుర్దాయం 2-4 సంవత్సరాలు
తరుచుదనముసంవత్సరానికి 100,000 మందికి 2.6 (ఐరోపా)

అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) ని మోటార్ న్యూరాన్ వ్యాధి అని (MND) లేదా లౌ గెహ్రిగ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. దీనిలో స్వచ్ఛంద కండరాలను (voluntary muscles) నియంత్రించే న్యూరాన్లు పనిచేయవు, నష్టపోతాయి.[1][2]

లక్షణాలు

[మార్చు]

కొంతమంది ఈ ఏ.ఎల్.ఎస్. కు సంబంధించిన అత్యంత సాధారణమైన లక్షణాలకు మోటార్ న్యూరాన్ వ్యాధి అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. కండరాలు బిగుసుకోవడం, మెలిపడడం, కండరాల పరిమాణం తగ్గడం వలన ఏ.ఎల్.ఎస్.లో క్రమంగా బలహీనతను పెరుగుతుంది.[3] ఇది చేతులు, కాళ్ళలో బలహీనత లేదా మాట్లాడటం, మింగడంలో కష్టం వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది.[4] ప్రభావితమైన వారిలో దాదాపు సగం మంది ఆలోచించడంలో, ప్రవర్తనలో కూడా తేలికపాటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, చాలా మంది నొప్పి కూడా అనుభవిస్తారు.[5][6] చివరికి నడవడం, చేతులు ఉపయోగించడం, మాట్లాడటం, మింగడం చివరికి ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు.[7]

కారణాలు

[మార్చు]

90 నుండి 95% కేసులలో ఈ వ్యాధికి కారణం తెలియదు[1], కానీ జన్యుపరమైన, పర్యావరణపరమైన కారకాల వలన ఈ పరిస్థితి అని అభిప్రాయపడుతారు[8] మిగిలిన 5-10% కేసులు ఒక వ్యక్తికి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి.[9] ఈ జన్యుపరమైన కేసులలో కూడా దాదాపు సగం మందిలో రెండు నిర్దిష్ట జన్యువులలో ఒకటి కారణం.[1] అంతర్లీన యంత్రాంగం ఎగువ, దిగువ మోటార్ న్యూరాన్లకు నష్టం కలిగిస్తుంది.[10]

చికిత్స

[మార్చు]

రోగనిర్ధారణ అనేది ఒక వ్యక్తి లక్షణాలపై ఆధారపడి ఉంటుంది, అయితే ఇతర సంభావ్య కారణాలను తోసిపుచ్చడానికి పరీక్షలు చేస్తారు. దీనికి చికిత్స లేదు.[1] చికిత్స లక్ష్యం లక్షణాలను తీవ్రతను తగ్గించడం.[5] రిలుజోల్ అనే మందులు వ్యాధిగ్రస్తుని జీవితాన్ని రెండు నుండి మూడు నెలల వరకు పొడిగించవచ్చు.[10] నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్[గమనిక 1] కొంత పరిస్థితి మెరుగుపడవచ్చు, జీవితకాలం పెరగవచ్చు.[7] యాంత్రిక వెంటిలేషన్ కూడా రోగి మనుగడను పొడిగించగలదు కాని వ్యాధి పురోగతిని ఆపలేదు.[11] ఒక ఆహారం పంపించే గొట్టం (ఫీడింగ్ ట్యూబ్) సహాయం తీసుకుంటారు.[12]

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

ఈ వ్యాధి ఏ వయసులో వారినైనా ప్రభావితం చేస్తుంది, కానీ సాధారణంగా 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయస్సులో వారసత్వంగా ప్రారంభమవుతుంది.[9] వ్యాధి ప్రారంభం నుండి మరణం వరకు వారి మనుగడ సగటున రెండు నుండి నాలుగు సంవత్సరాలు, అయితే ఇది కొందరిలో మారవచ్చు, సుమారు 10% మంది 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కూడా జీవిస్తారు.[7][1][13]

వ్యాధిగ్రస్తులలో చాలా మంది శ్వాసకోశ వైఫల్యంతో మరణిస్తున్నారు.[9] ఐరోపాలో, ఈ వ్యాధి సంవత్సరానికి 100,000 మందిలో రెండు నుండి మూడు మందిని ప్రభావితం చేస్తుంది.[14]యునైటెడ్ స్టేట్స్ లో ఇది నల్లజాతీయుల కంటే తెల్లజాతి ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది.[15]

చార్లెస్ బెల్ 1824వ సంవత్సరం లోనే ఈ వ్యాధి గురించి తెలిపారు. 1869లో మొట్టమొదటగా వీటి లక్షణాలు, అంతర్లీన నరాల సంబంధిత సమస్యల మధ్య సంబంధాన్ని జీన్-మార్టిన్ చార్కోట్ వివరించారు. ఆయన 1874లో అమ్యోట్రోఫిక్ పార్శ్వ స్క్లెరోసిస్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు.[16] 20వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ లో 1939లో బేస్ బాల్ ఆటగాడు లౌ గెహ్రిగ్ను ప్రభావితం చేసిన తరువాత నుంచి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. తరువాత 1963లో విశ్వ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కు ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.[17][18]

మొదటి ALS జన్యువును 1993లో కనుగొన్నారు.1994లో మొదటి జంతు నమూనా అభివృద్ధి చేశారు.[19][20]2014లో, ఐస్ బకెట్ ఛాలెంజ్ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, ఈ పరిస్థితి గురించి ప్రజలలో అవగాహన పెరిగింది.

గమనిక

[మార్చు]
  1. ↑ ముఖానికి, ముక్కుకు మాస్క్, లేదా హెల్మెట్ ద్వారా శ్వాస సహాయాన్ని అందించడం. సాధారణంగా ఆక్సిజన్‌ను జోడించిన గాలిని, సరిఅయిన ఒత్తిడి లేదా పీడనంతో మాస్క్ ద్వారా ఇస్తారు. దీనిని "నాన్-ఇన్వాసివ్" అని అంటారు, ఎందుకంటే దీనిని ముఖానికి లేదా తల చుట్టూ గట్టిగా అమర్చిన మాస్క్‌తో అందిస్తారు, దీనిలో ట్రాకియల్ ఇంట్యూబేషన్ అంటే నోటి ద్వారా శ్వాసనాళంలోకి గొట్టం అవసరం లేకుండా ఉంటుంది

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 "Amyotrophic Lateral Sclerosis (ALS) Fact Sheet". National Institute of Neurological Disorders and Stroke. 19 September 2014. Archived from the original on 5 January 2017. Retrieved 2 January 2015.
  2. ↑ "Motor neurone disease". NHS Choices. Archived from the original on 29 December 2014. Retrieved 2 January 2015.
  3. ↑ "Motor Neuron Diseases Fact Sheet". National Institute of Neurological Disorders and Stroke. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 7 నవంబరు 2010.
  4. ↑ Hardiman O, Al-Chalabi A, Chio A, Corr EM, Logroscino G, Robberecht W, Shaw PJ, Simmons Z, van den Berg LH (October 2017). "Amyotrophic lateral sclerosis" (PDF). Nature Reviews. Disease Primers. 3 (17071): 17071. doi:10.1038/nrdp.2017.71. PMID 28980624. Archived (PDF) from the original on 1 December 2020. Retrieved 1 August 2020.
  5. 1 2 van Es MA, Hardiman O, Chio A, Al-Chalabi A, Pasterkamp RJ, Veldink JH, van den Berg LH (November 2017). "Amyotrophic lateral sclerosis". Lancet. 390 (10107): 2084–2098. doi:10.1016/S0140-6736(17)31287-4. PMID 28552366.
  6. ↑ van Es MA, Hardiman O, Chio A, Al-Chalabi A, Pasterkamp RJ, Veldink JH, van den Berg LH (November 2017). "Amyotrophic lateral sclerosis". Lancet. 390 (10107): 2084–2098. doi:10.1016/S0140-6736(17)31287-4. PMID 28552366.
  7. 1 2 3 Hobson EV, McDermott CJ (September 2016). "Supportive and symptomatic management of amyotrophic lateral sclerosis" (PDF). Nature Reviews. Neurology. 12 (9): 526–38. doi:10.1038/nrneurol.2016.111. PMID 27514291. Archived (PDF) from the original on 1 December 2020. Retrieved 1 August 2020.
  8. ↑ Wingo TS, Cutler DJ, Yarab N, Kelly CM, Glass JD (2011). "The heritability of amyotrophic lateral sclerosis in a clinically ascertained United States research registry". PLOS ONE. 6 (11): e27985. Bibcode:2011PLoSO...627985W. doi:10.1371/journal.pone.0027985. PMC 3222666. PMID 22132186.{{cite journal}}: CS1 maint: article number as page number (link) CS1 maint: unflagged free DOI (link)
  9. 1 2 3 Kiernan MC, Vucic S, Cheah BC, Turner MR, Eisen A, Hardiman O, Burrell JR, Zoing MC (March 2011). "Amyotrophic lateral sclerosis". Lancet. 377 (9769): 942–55. doi:10.1016/s0140-6736(10)61156-7. PMID 21296405.
  10. 1 2 "Motor Neuron Diseases Fact Sheet". National Institute of Neurological Disorders and Stroke. Archived from the original on 13 April 2014. Retrieved 7 November 2010.
  11. ↑ Soriani M, Desnuelle C (May 2017). "Care management in amyotrophic lateral sclerosis". Revue Neurologique. 173 (5): 288–89. doi:10.1016/j.neurol.2017.03.031. PMID 28461024.
  12. ↑ Connolly S, Galvin M, Hardiman O (April 2015). "End-of-life management in patients with amyotrophic lateral sclerosis". The Lancet. Neurology. 14 (4): 435–42. doi:10.1016/S1474-4422(14)70221-2. PMID 25728958.
  13. ↑ Swinnen B, Robberecht W (November 2014). "The phenotypic variability of amyotrophic lateral sclerosis". Nature Reviews. Neurology. 10 (11): 661–70. doi:10.1038/nrneurol.2014.184. PMID 25311585. Archived from the original on 31 December 2018. Retrieved 1 August 2020.
  14. ↑ Hardiman O, Al-Chalabi A, Brayne C, Beghi E, van den Berg LH, Chio A, Martin S, Logroscino G, Rooney J (July 2017). "The changing picture of amyotrophic lateral sclerosis: lessons from European registers". Journal of Neurology, Neurosurgery, and Psychiatry. 88 (7): 557–63. doi:10.1136/jnnp-2016-314495. PMID 28285264. Archived from the original on 21 December 2019. Retrieved 1 August 2020.
  15. ↑ Mehta P, Kaye W, Raymond J, Punjabi R, Larson T, Cohen J, Muravov O, Horton K (November 2018). "Prevalence of Amyotrophic Lateral Sclerosis – United States, 2015". Morbidity and Mortality Weekly Report. 67 (46): 1285–1289. doi:10.15585/mmwr.mm6746a1. PMC 5858037. PMID 30462626.
  16. ↑ Rowland LP (March 2001). "How amyotrophic lateral sclerosis got its name: the clinical-pathologic genius of Jean-Martin Charcot". Archives of Neurology. 58 (3): 512–15. doi:10.1001/archneur.58.3.512. PMID 11255459.
  17. ↑ Kelly, Evelyn B. (2013). Encyclopedia of human genetics and disease. Santa Barbara, CA: Greenwood. pp. 79–80. ISBN 978-0-313-38713-5. Archived from the original on 8 సెప్టెంబరు 2017.
  18. ↑ Youngson, David B. Jacoby, Robert M. (2004). Encyclopedia of family health (3rd ed.). Tarrytown, NY: Marshall Cavendish. p. 1256. ISBN 978-0-7614-7486-9. Archived from the original on 8 సెప్టెంబరు 2017.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  19. ↑ Renton AE, Chiò A, Traynor BJ (January 2014). "State of play in amyotrophic lateral sclerosis genetics". Nature Neuroscience. 17 (1): 17–23. doi:10.1038/nn.3584. hdl:2318/156177. PMC 4544832. PMID 24369373.
  20. ↑ Lutz C (August 2018). "Mouse models of ALS: Past, present and future". Brain Research. 1693 (Part A): 1–10. doi:10.1016/j.brainres.2018.03.024. PMID 29577886.